News April 7, 2025
పెద్దపల్లి: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.
Similar News
News April 19, 2025
ధైర్యంగా, తెలివిగా వ్యవహరించండి: అన్నమయ్య ఎస్పీ

‘ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీరు ధైర్యంగా, తెలివిగా వ్యవహరిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు’ అని SP విద్యాసాగర్ నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా, ప్రశాంతంగా సమస్య ఏమిటో పూర్తిగా తెలుసుకోండి. దాని మూలాలు, ప్రభావంపై విశ్లేషించండి. సమస్య పరిష్కరణకు ప్రణాళికను రూపొందించుకోండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, నిపుణుల సలహా తీసుకోండి’ అని ప్రజలకు సూచించారు.
News April 19, 2025
GNT: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎక్సైజ్ కమిషనర్ నీషాంత్ కుమార్, జేసీ భార్గవ్ తేజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీబాషా, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News April 19, 2025
సిద్దిపేట: ఈనెల 20 బీసీ గురుకుల ఎంట్రెన్స్ టెస్ట్

మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష (ఎంట్రెన్స్ ఎగ్జామ్) ఈ నెల 20 జరగనుంది. సిద్దిపేటలో ఎగ్జామ్ జరగనున్న మూడు పరీక్ష కేంద్రాల్లో వద్ద 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ బి. అనురాధ తెలిపారు. ఈ నెల 20 ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.