News February 18, 2025

పెద్దపల్లి: సంస్థ భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత: CMD

image

సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని, సక్రమంగా విధులు నిర్వహించాలని, అలసత్వం ప్రదర్శించే వారికి కంపెనీలో స్థానం ఉండదని సంస్థ CMD బలరాం స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల GMలు, 39 గనులకు సంబంధించిన ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో తొలిసారిగా HYD సింగరేణి భవన్ నుంచి ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఆయా ఏరియాలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆదేశించారు.

Similar News

News January 11, 2026

నిరసనల్లో పాల్గొంటే మరణ శిక్ష: ఇరాన్

image

నిరసనల్లో పాల్గొంటే దేవుడి శత్రువుగా భావిస్తామని ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. దేశ చట్టాల ప్రకారం మరణశిక్ష అభియోగాలు తప్పవని అటార్నీ జనరల్ ఆజాద్ హెచ్చరించారు. అల్లర్లు చేసే వారికి సాయం చేసినా ఇదే శిక్ష తప్పదని చెప్పారు. ఇప్పటిదాకా 2,300 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు నిరసనలను <<18818974>>తీవ్రం చేయాలని<<>> ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ పిలుపునివ్వడం తెలిసిందే.

News January 11, 2026

పల్లెనిద్ర తప్పనిసరి: కడప ఎస్పీ

image

పోలీస్ అధికారులంతా తప్పనిసరిగా పల్లెనిద్ర చేపట్టాలని జిల్లా ఎస్పీ నచికేత్ సూచించారు. శనివారం కడప పోలీస్ సబ్ డివిజన్ నేర సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి నిలపాలన్నారు. ఫిర్యాదు దారులపట్ల మర్యాదపూర్వకంగా నడుచుకొని సమస్యని పరిష్కరించాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు.

News January 11, 2026

గండికోట ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ శ్రీధర్

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న గండికోట ఉత్సవాలకు సంబంధించి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఏర్పాట్లను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాట్లుచేయాలని అధికారులకు సూచించారు. స్టేజీ, పార్కింగ్ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సలహాలు, సూచనలు ఇచ్చారు.