News January 30, 2025
పెద్దపల్లి: సకాలంలో పన్నులు చెల్లించాలి: రవాణా అధికారి

పెద్దపల్లి జిల్లాలోని వాహనదారులందరూ సకాలంలో వాహన పన్ను చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి పి.రంగారావు తెలిపారు. వాణిజ్య, వాణిజ్యేతర వాహనదారులు కేటాయించిన సమయంలోగా ఆలస్యం చేయకుండా పన్నులు కట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 100కు పైగా వాహనాలు పన్నులు చెల్లించకుండా తిరుగుతున్నట్లు తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించకుంటే ఫైన్లు వేస్తామన్నారు.
Similar News
News November 26, 2025
iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.
News November 26, 2025
హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన పురందీశ్వరి

రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి బుధవారం రాజమండ్రి రూరల్ వేమగిరిలోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నర్సరీ రైతు ఈ పరిశోధనా కేంద్రం ద్వారా ఉపయోగం పొందాలని ఆమె అన్నారు. ప్రతి నర్సరీ రైతు విధిగా తమ పేరును హార్టికల్చర్ ఏడీ ఆఫీసులో నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 26, 2025
పెద్దపల్లి: ‘బీసీ ఉద్యమాలలో మహిళలు భాగస్వామ్యం కావాలి’

పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన సెమినార్లో ‘బీసీ ఉద్యమాల్లో మహిళల పాత్ర’ అంశంపై చర్చ జరిగింది. బీసీ హక్కుల సాధనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరని నాయకులు అభిప్రాయపడ్డారు. బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ను 22%కు తగ్గించడం అన్యాయమని, కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని ఉద్యమకారుడు శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు.


