News February 25, 2025
పెద్దపల్లి: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం, గోదావరిఖని, మంథని, రామగిరి, 8ఇంక్లైన్ కాలనీ ఏరియాల్లో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
Similar News
News March 25, 2025
చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్

మోహన్ లాల్ ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో చిరంజీవి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గాడ్ ఫాదర్‌ను తాను చూశానని, సినిమాలో కొన్ని పాత్రలు, సీన్లు తీసేశారని చెప్పారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారన్నారు. అయితే లూసిఫర్-2తో గాడ్ ఫాదర్-2 తీయలేరని, ఇందులోని పాత్రలను తీసేయడం అసాధ్యమన్నారు. కాగా ‘L2:ఎంపురాన్’ ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.
News March 25, 2025
సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదుల నిరసన

హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా కోర్టు ముందు భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి డిమాండ్ చేశారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
News March 25, 2025
విశాఖ : ఈ స్థానాలలో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ నగరం కార్ షెడ్ , కొమ్మాది, రుషికొండ, సింహాచలం, దువ్వాడ, కూర్మన్నపాలెం, పాత గాజువాక, షీలానగర్, మర్రిపాలెం, ద్వారకానగర్ స్థానాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <