News March 13, 2025

పెద్దపల్లి: సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించవచ్చు: అదనపు కలెక్టర్

image

సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించవచ్చని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు మార్చి 31వ తేదీలోపు  చెల్లిస్తే రాయితీ ఉంటుందని అన్నారు. మీసేవా, అధికారులు, డిజిటల్ పేమెంట్ ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 29, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 29, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.10 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 29, 2025

తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

image

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.

News October 29, 2025

కాగజ్‌నగర్: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

image

స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ప్రజలను మోసం చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదోద్దీన్ మంగళవారం తెలిపారు. నిందితుడు స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి 108 మందిని అందులో చేర్చి పెట్టుబడుదారులను మోసం చేసినట్లు తెలిపారు. అందులో 26 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.76,50,000 ఇన్వెస్ట్ చేశాడని పేర్కొన్నారు.