News January 30, 2025
పెద్దపల్లి: స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

రాబోయే గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దత పై అదనపు కలెక్టర్లు జే.అరుణ శ్రీ, డి.వేణు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 19, 2025
వరంగల్: రిలయన్స్ స్మార్ట్పై కేసు నమోదు

వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోగల రిలయన్స్ స్మార్ట్పై కేసు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రలాజికల్ ఇన్స్పెక్టర్ మనోహర్ తెలిపారు. జడల శ్యామ్ అనే వినియోగదారుడికి మాయిశ్చరైజర్ క్రీంను ఎమ్మార్పీ ధర రూ.131 ఉండగా రూ.141లకు విక్రయించారు. అతను తగిన ఆధారాలతో తమకు ఫిర్యాదు చేయగా రిలయన్స్ స్మార్ట్లో తనిఖీలు చేసి అధిక ధరకు అమ్మినట్లు నిర్ధారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News December 19, 2025
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా పర్యటన

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు మార్ యాదవ్ రెండు రోజుల జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆయన ఈనెల 20వ తేదీ రాత్రి 9 గంటలకు అన్నవరం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ అన్నవరం నుంచి కాకినాడ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు అన్నవరంలో బయల్దేరి కాకినాడ విచ్చేస్తారు. కాకినాడలో జరిగే వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ, పల్స్ పొలియోలో పాల్గొంటారని జిల్లా సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
News December 19, 2025
నెల్లూరు: డిజిటల్ సర్వేలో ‘పంట నమోదు’

రబీ సీజన్కు సంబంధించి డిజిటల్ పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 18 నుంచి ఫిబ్రవరి వరకు సర్వే కొనసాగుతోంది. జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్న లక్ష మంది రైతులు సచివాలయ, వ్యవసాయ సహాయకుల ద్వారా తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. ధాన్యం కొనుగోళ్లు, వడ్డీ లేని రుణాలు, పంట బీమా, పరిహారం పథకాలు వర్తించాలంటే ఈ-క్రాప్ తప్పనిసరి అని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.


