News March 5, 2026
పెద్దపల్లి: స్పెషలిస్ట్ ఆరోగ్య శిబిరాల షెడ్యూల్ ఇలా…

జిల్లా PHC/UHCలలో స్పెషలిస్ట్ ఆరోగ్య శిబిరాల షెడ్యూల్: మార్చి 6- PHC రాఘవపూర్, 7- PHC ఓదెల, UHC అడ్డగుంటపల్లి, 9- UHC అల్లూరు, PHC పుట్నూరు, 10- UHC జనగాం, 5 ఇంక్లైన్, 11- PHC రాగినేడు, లక్ష్మీపూర్, 12- UHC పెద్దపల్లి, PHC రామగుండం, 14- అంతర్గాం, 16- బసంత్ నగర్, 17- బేగంపేట, 18- ఎలిగేడు, 20- గద్దలపల్లి, 23 -గర్రెపల్లి, 24 -జూలపల్లి, 25 -కమాన్పూర్, 26- కొలనూరు, 28 కునారం, 30 -మేడారం, 31 -ముత్తారం.
Similar News
News April 13, 2026
HYD: కన్నీటి కడలిలో ఎదురీదిన సృజన

రాజేంద్రనగర్ మండలం పద్మశాలిపురం బస్తీకి చెందిన గుంటి సృజన కష్టాల మధ్య అద్భుతం చేసి చూపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రిని ఆస్పత్రిలో చూసుకుంటూనే ఇంటర్ పరీక్షలకు హాజరైంది. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. బైపీసీలో 440 మార్కులకు 427 మార్కులు సాధించి తండ్రి ముఖంలో వెలుగు నింపాలనుకుంది. కానీ ఈ లోపే తండ్రి కాలంచేయడంతో మార్కులు చూసుకుంటూ తండ్రిని తలచుకుని కన్నీరు పెట్టుకుంది.
News April 13, 2026
HYD: చనిపోతే ఆధార్ డీయాక్టివేట్ చేయండిలా

మరణించిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే విధానాన్ని UIDAI వెల్లడించింది. మీ సొంత ఆధార్ నంబర్ కానీ, కుటుంబ సభ్యులు ఆధార్ నంబర్‌తో My Aadhaar పోర్టల్‌లో లాగిన్ అయ్యి ‘Report Death Of A Family Member’ ఆప్షన్ ద్వారా మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు, డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం మరణ ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేస్తే, పరిశీలన అనంతరం ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తారు.
News April 13, 2026
జగిత్యాల: ప్రశాంతంగా పదో తరగతి పరీక్షల ముగింపు

జగిత్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి పరీక్ష సందర్భంగా పురాణిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కేంద్రాన్ని కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల తనిఖీ, సీసీ కెమెరాల పర్యవేక్షణను సమీక్షించారు. విద్యార్థులకు తాగునీరు, వెలుతురు, శౌచాలయ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం కఠినంగా అమలు చేయాలని అన్నారు.


