News March 10, 2025

పెద్దపల్లి: 10వ తరగతి పరీక్షల నిర్వహణపై DEO సమీక్ష

image

10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టరేట్ సీ విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, DEO మాధవి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో తెలిపారు. మార్చి 21నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహించాలన్నారు. జిల్లాలో పరీక్షల కోసం 41 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు.

Similar News

News January 16, 2026

కర్నూలు: ‘యువకుడి మృతి.. గుర్తిస్తే చెప్పండి’

image

కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ గేట్ సమీపంలో ఇవాళ సాయంత్రం బైక్ ఢీకొనడంతో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25-30 ఏళ్లు ఉంటాయి. ఎడమ చేతి మణికట్టుపై ॐ, GP పచ్చబొట్లు ఉన్నాయి. వివరాలు తెలిసిన వారు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌ 9121101063 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు కోరారు.

News January 16, 2026

మాడుగుల: రెండు రోజుల తర్వాత మృతదేహం తరలింపు

image

మాడుగుల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ రత్నకుమారి కేజీహెచ్‌లో చి<<18874616>>కిత్స పొందుతూ మృతి చెందగా <<>>అంబులెన్స్ అందించడంలో నిర్లక్ష్యం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి రత్నకుమారి మృతదేహాన్ని మాడుగుల సమీపంలోని గిరిజన ప్రాంతానికి తరలించారు. ఆ కుటుంబం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

News January 16, 2026

ED దాడులు.. బీరువా నిండా రూ.500 నోట్లు

image

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈడీ చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. బొగ్గు, బ్లాక్ స్టోన్ అక్రమ మైనింగ్‌పై విచారణ నేపథ్యంలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. PMLA కింద మాఫియా, వారి వ్యాపార భాగస్వాముల ఇళ్లలో దాడులు చేసింది. ఓ బీరువా నిండా నగదు, లగ్జరీ కార్లు, ఆస్తి పత్రాలను గుర్తించింది. ఆ నగదు విలువ ఎంతో త్వరలో వెల్లడిస్తామని ఈడీ తెలిపింది.