News March 17, 2025
పెద్దపల్లి: 196 మంది విద్యార్థుల గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 96.4 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. ఫిజిక్స్ / ఎక్నామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఈ పరీక్షకు 5,500 మంది హాజరు కావాల్సి ఉండగా 5,304 మంది హాజరు కాగా..196 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.
Similar News
News January 3, 2026
మేడ్చల్ జిల్లాలో క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఇది..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి కీసర మండలం సహా అనేక ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పిచ్చిగడ్డి, మొక్కలతో కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం 259 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 145 క్రీడా ప్రాంగణాలను లే అవుట్ పార్కు స్థలాల్లో మొక్కుబడిగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహణ మరిచింది. దీంతో ప్రస్తుతం అవి ఎటూ పనికిరాకుండా పోతున్నాయని ప్రజలంటున్నారు.
News January 3, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు: భూపాలపల్లి కలెక్టర్

పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, వైద్య, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి పోలీస్, రవాణ, ఆర్‌అండ్‌బీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నియంత్రణకు తగుచర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రతిపాదన చేశారు.
News January 3, 2026
వికారాబాద్: అక్రమంగా మైనింగ్.. గ్రామస్థుల ఆందోళన

వికారాబాద్ జిల్లాలో సుద్ద మైనింగ్ జోరుగా సాగుతుంది. ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ కూర్దు, తరిగోపుల, నాగసాన్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని జోరుగా మైనింగ్ జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారుల తీరు పట్ల మాత్రం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి?


