News February 4, 2025
పెద్దపల్లి: 2 లక్షలకుపైగా విద్యార్థులకు నులి పురుగుల మాత్రలు: కలెక్టర్

19 ఏళ్లలోపు ప్రతిఒక్కరికి నులి పురుగుల నివారణ మాత్రలను అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ సూచించారు. ఈనెల 10 నుంచి 17 వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, కాలేజీలలో 2 లక్షలకుపైగా విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
వచ్చే వారం నుంచే ఎన్టీఆర్-నీల్ సినిమా షూట్?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగన్’ అన్న వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల సమాచారం. వికారాబాద్ అడవుల్లో స్టార్ట్ చేయనున్న ఈ తొలి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాల్గొనరని భోగట్టా. మూవీ కోసం ఆర్ఎఫ్సీలో ఇప్పటికే భారీ సెట్ తయారవుతోంది. ఆ సెట్లో జరిగే సెకండ్ షెడ్యూల్‌కు తారక్ వస్తారని తెలుస్తోంది.
News February 18, 2025
KMR: టీచరే కీచకుడిగా మారాడు

గాంధారి మండలంలో సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. SI ఆంజనేయులు వివరాలిలా.. మండలంలోని ప్రభుత్వ పాఠశాల టీచర్ రమేశ్ అదే పాఠశాలలో చదువుకునే విద్యార్థినిని సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు ఫోన్లో చెబుతానని తల్లిదండ్రుల ఫోన్ నంబర్ తీసుకొని అసభ్యకర మెసేజ్‌లు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 18, 2025
బావ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేసిన బావమరిది!

బావమరిది బతుకగోరతాడని సామెత. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ బావమరిది తన సోదరి భర్త కోసం ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా అతడి సోదరి భర్తతో పుట్టింటికి వస్తుండటంతో వాళ్లు చాలా గ్రాండ్‌గా రావాలని పట్నా నుంచి వైశాలి వరకూ 30 కిలోమీటర్ల దూరం మేర హెలికాప్టర్లో తీసుకొచ్చాడు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులు వారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.