News March 7, 2025
పెద్దపల్లి: 20 ఏళ్ల నుంచి చోరీలు.. 36 కేసులు నమోదు

2005 నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పలు జిల్లాల్లో 36 కేసులు నమోదయ్యాయని ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఏసీపీ వివరాలిలా.. భూపాలపల్లి(D) మల్హర్‌రావు(M) రెడ్డిపల్లెకు చెందిన బోరిగం సంపత్ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. ఇటీవల పెద్దపల్లి(D) కాల్వ శ్రీరాంపూర్(M) చిన్నరాతులపల్లిలో శాంతమ్మ ఇంట్లో బంగారం అపహరించగా, విచారణ జరిపి, అతని వద్ద నుంచి రూ.15.47 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News March 17, 2025
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయను: హర్ష సాయి

ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను తాను ప్రమోట్ చేయనని ప్రముఖ యూట్యూబర్ <<15777784>>హర్షసాయి<<>> అన్నారు. బెట్టింగ్ మూలాలపై అందరం కలిసి పోరాడదామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందెన్నడూ తాను చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయలేదని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. కాగా వీసీ సజ్జనార్ సూచనల మేరకు హర్షసాయిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
News March 17, 2025
రాష్ట్రంలో అంతా బానే ఉందని నమ్మించే ప్రయత్నం: KTR

TG: ఏడాదిలో రూ.70 వేల కోట్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్ ఒప్పుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో అంతా బానే ఉందని కాంగ్రెస్ నమ్మించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పెట్టుబడులు, వ్యవసాయ రంగ వృద్ధి, సంపద, సీఎం పనితీరు మెరుగ్గా ఉందని చెబుతోందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు, విధానాల ఫలితమే ఈ ప్రతికూల వృద్ధి అని పేర్కొన్నారు.
News March 17, 2025
మెదక్: ఓపెన్ టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.