News March 16, 2025
పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News March 18, 2025
NLG: అటు పరీక్షలు.. ఇటు ముమ్మరంగా మూల్యాంకనం!

జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం ముమ్మరంగా సాగుతోంది. ఇంటర్ పరీక్షలు సాగుతుండగానే.. ఈ నెల 10నే అధికారులు మూల్యాంకనాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అన్ని పేపర్లను NLG కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాలలో దిద్దుతున్నారు. మూల్యాంకనం నిర్వహించే ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విడతల వారీగా ఈ ప్రక్రియను చేపట్టి ఏప్రిల్ 10 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.
News March 18, 2025
దిల్‌సుఖ్‌నగర్‌లో యువతులతో వ్యభిచారం.. ARREST

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న ఓ మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.
News March 18, 2025
నెలకు రూ.5,000.. UPDATE

యువతకు నైపుణ్యాన్ని అందించి ఉపాధి కల్పనే లక్ష్యంగా తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి కేంద్రం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. యువతను ఇందులో భారీగా చేరేలా ప్రోత్సహించాలని MPలకు సూచించారు. ఇంటర్న్‌కు ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.5వేలు ఇవ్వనున్నారు. ఈ పథకం <<15723056>>రెండో దశ దరఖాస్తు గడువును<<>> కేంద్రం ఈ నెల 31 వరకు పొడిగించింది.