News March 10, 2025

పెద్దపల్లి: 91 మంది విద్యార్థులు గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ రెండవ సంవత్సరం ఆంగ్ల పరీక్ష సోమవారం ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ రెండవ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 4,801 మంది హాజరు కావాల్సి ఉండగా 4,710 మంది హాజరయ్యారని తెలిపారు. 91 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని తెలిపారు. తద్వారా 98.10శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఈమేరకు తెలిపారు.

Similar News

News March 15, 2025

కౌటాల: గ్రూప్-2లో 191, గ్రూప్-3లో 349వ ర్యాంకు

image

ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకి చెందిన <<15731264>>సాయిరాం గౌడ్ గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో<<>> సత్తా చాటాడు. నిన్న విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 349వ ర్యాంక్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు విడుదలైన గ్రూప్- 2 ఫలితాల్లో 191వ ర్యాంకు సాధించాడు. గ్రూప్- 4లో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ -1 మెయిన్స్‌లోను 436 మార్కులతో సాధించాడు. ప్రస్తుతం బెజ్జూరు మండలం మొగవెల్లి JPS విధులు నిర్వహిస్తున్నారు.

News March 15, 2025

సంగారెడ్డి: నేడు పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రుల (పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.

News March 15, 2025

ఎచ్చెర్ల : రోడ్డు ప్రమాదంలో చెన్నై వాసి మృతి

image

జరజాం జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బి.ఆకాశ్(35) శ్రీకాకుళం నుంచి విశాఖకు కారులో వెళ్తూ.. జరజాం జంక్షన్ సమీపంలో ముందువెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవ్ చేస్తున్న ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!