News January 30, 2025
పెద్దపల్లి: LOVE FAILURE.. యువకుడి SUICIDE

లవ్ ఫెయిల్యూర్తో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన వివేక్(21) మంచిర్యాల జిల్లాలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. కొన్ని రోజులుగా లవ్ ఫెయిల్యూర్ కారణంగా బాధపడుతూ దిగాలుగా ఉంటున్నాడు. రాత్రి సమయంలో తన రూంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 8, 2025
బరువు తగ్గాలంటే వీటిని ట్రై చేయండి!

బరువు తగ్గాలనుకునేవారికి డ్రైఫ్రూట్స్ సాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘బాదం తీసుకుంటే వాటిలోని ఫైబర్, కొవ్వుల వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఆక్రోట్లలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకలి తగ్గుతుంది. భోజనానికి ముందు గుప్పెడు పల్లీలు తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఖర్జూరాల వల్ల అధిక శక్తి అంది త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.
News December 8, 2025
సిద్దిపేట: ఈ ప్రాంతాల్లో సెక్షన్163 అమలు: సీపీ

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు (మొదటి దశ) ప్రశాంతంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు సెక్షన్ 163 BNSS, 2023 అమలులో ఉంటుందని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 12 ఉదయం 7 గంటల వరకు దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవపూర్, మార్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్లో అమలులో ఉంటుందన్నారు.
News December 8, 2025
తిరుపతి: నేడు కీలక కేసుల విచారణ

తిరుపతి వేదికగా సాగుతున్న పలు కీలక కేసులు సోమవారం కోర్టులో విచారణకు రానున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నెల్లూరు ACB కోర్టులో ఏ-16 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్, ఏ-29 సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ విచారణ జరగనుంది. మరో వైపు హై కోర్టులో పరకామణీ కేసు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.


