News January 30, 2025
పెద్దపల్లి: LOVE FAILURE.. యువకుడి SUICIDE

లవ్ ఫెయిల్యూర్‌తో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన వివేక్(21) మంచిర్యాల జిల్లాలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. కొన్ని రోజులుగా లవ్ ఫెయిల్యూర్ కారణంగా బాధపడుతూ దిగాలుగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం ఉరేసుకున్నట్లు కుటుంబీకులు గుర్తించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 19, 2025
అనకాపల్లి: ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ

నిర్మాణ పనుల కారణంగా రద్దు చేసిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్(18519/18520)ను పునరుద్ధరించనున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 20న విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18519), తిరుగు ప్రయాణంలో ఎల్‌టీటీ-విశాఖ ఎక్స్‌ప్రెస్ (18520) ఈనెల 21న షెడ్యూల్ ప్రకారం యథావిధిగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి దువ్వాడ, విజయవాడ మీదుగా ముంబై వెళ్తుందన్నారు.
News February 19, 2025
దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆరుగురు స్నేహితుల్ని ఆమెపైకి ఉసిగొల్పి పైశాచిక ఆనందం పొందాడు. నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
News February 19, 2025
ఖమ్మం: ముగ్గురు మంత్రులు ఉండి రైతులను పట్టించుకోరా?: MLC

ముగ్గురు మంత్రులండి జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం పట్టించుకోవడంలేదని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య పంట పొలానికి నీరు అందక ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వ హత్య అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని, రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.