News March 4, 2025
పెద్దపల్లి: LRS ఫీజులపై 25% మినహాయింపు: కమిషనర్

పెద్దపల్లి పట్టణ ప్రజలు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) పరిధిలో ఫీజులు మార్చి 31లోపు చెల్లిస్తే 25% మినహాయింపు పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ఫీజులు చెల్లించి ప్రయోజనం పొందాలని కమిషనర్ కోరారు.
Similar News
News November 17, 2025
సత్వర న్యాయం అందించడమే లక్ష్యం: ఎస్పీ

ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 58 అర్జీలు అందగా, వాటిలో 13 భూతగాదాలు, 18 కుటుంబ కలహాలు, 27 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
News November 17, 2025
బెల్లం.. మహిళలకు ఓ వరం

నిత్యం ఇంట్లో, బయట పనులను చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా కాకూడదంటే బెల్లాన్ని తమ డైట్లో చేర్చుకోవాల్సిందే. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. బరువును తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు.
News November 17, 2025
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఇలా త్రిపాఠి

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు అందాయి. 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు సంబంధించినవి వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు.


