News February 26, 2026
పెద్దపల్లి: TASK ద్వారా ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్

PDPL నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు TASK రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023-2026లో డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన వారు అర్హులు. FEB 25-28 వరకు నమోదు, MAR 2-22 వరకు శిక్షణ ఉంటుంది. మొత్తం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆసక్తి గల వారు TASK సెంటర్, PDPLలో నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 13, 2026
తలుపులమ్మ దర్శనం ముగించుకుని వస్తుండగా ప్రమాదం!

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాకకు చెందిన బి.కృష్ణ, రామలక్ష్మి దంపతులు తలుపులమ్మ లోవ దర్శనం ముగించుకుని వస్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వారిని ఎం.అప్పలరాజు అనే వ్యక్తి 108 వాహనంలో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
News April 13, 2026
ఇంటర్ ఫలితాలు.. 1000కి 997 మార్కులు

TGలో నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. MPCలో సాయి శ్రేష్ఠిత 1000కి 997, BiPCలో కె.జ్యోత్స్న, హఫ్సాబేగం 1000కి 997 చొప్పున స్కోర్ చేశారు. ఇక ఫస్టియర్ MPCలో పలువురు విద్యార్థులు 470కి 469 మార్కులు సాధించారు. నేటి నుంచి ఈ నెల 20వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.100 చొప్పున, రీవెరిఫికేషన్‌కు రూ.800 చొప్పున చెల్లించాలి.
News April 13, 2026
పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్కెట్లో రేటు తగ్గినా నష్టం కలగకుండా ధర లోటు చెల్లింపు పథకం(PDPS) అమలుకు శ్రీకారం చుడుతోంది. పైలట్ ప్రాజెక్టుగా తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. దీని ప్రకారం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉంటే ఆ తేడా మొత్తాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. ఇది అమల్లోకి వస్తే ధర తగ్గినా రైతులకు నష్టం కలగదు.


