News February 26, 2026

పెద్దపల్లి: TASK ద్వారా ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్

image

PDPL నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు TASK రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 2023-2026లో డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన వారు అర్హులు. FEB 25-28 వరకు నమోదు, MAR 2-22 వరకు శిక్షణ ఉంటుంది. మొత్తం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆసక్తి గల వారు TASK సెంటర్, PDPLలో నమోదు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 18, 2026

బ్యారేజీల మరమ్మతుల్లో జాప్యం ఎందుకు?: NDSA ఛైర్మన్

image

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనుల్లో జరుగుతున్న జాప్యంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఏజెన్సీలతో ఉన్న కొన్ని ఒప్పందపరమైన సమస్యల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి NDSA ఛైర్మన్‌కు వివరించారు.

News April 18, 2026

రంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్..!

image

రంగారెడ్డి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠంగా కందుకూరు పరిధి రాచలూరు, ఇబ్రహీంపట్నం, కొంగరకలాన్, గండిపేట, మొయినాబాద్, యాచారం ఏరియాల్లో ఇటీవల 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లోనూ 42కుపైగా నమోదు కావడం గమనార్హం.