News July 11, 2024

పెద్దపులి పాదముద్రల గుర్తింపు

image

నంద్యాల జిల్లాలోని మహానంది, రుద్రవరం మండలాల్లో కొంతకాలంగా చిరుత పులి సంచారంతో బెంబేలెత్తిన జనాలకు.. ఇప్పుడు పెద్దపులి భయం పట్టుకుంది. బుధవారం రుద్రవరం మండలం చెలిమ ఫారెస్టు రేంజ్‌లోని కోటకొండ పొలాల్లో పెద్దపులి సంచరించినట్లు రైతులు గుర్తించారు. పెద్దపులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని అన్నారు.

Similar News

News October 7, 2024

కర్నూలు: కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి భారీ కుంభకోణం?

image

కర్నూలు కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం వేరే ప్రాంతానికి బదిలీ అవ్వగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆలయం పేరిట సొంత ఖాతా తెరచి రూ.1.30 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. బినామీలు, సిబ్బంది పేరిట డబ్బులు విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News October 7, 2024

నందికొట్కూరు: రూ.100కి చేరిన టమాటా

image

నందికొట్కూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధర అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లో టమోటా ధర రూ.70 -80 పలుకుతోంది. నందికొట్కూరు సంత మార్కెట్ లో సోమవారం రిటైల్ మార్కెట్లో టమాటా ధర రూ.100 దాటిందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధర కూడా రూ.70- 80 కి చేరిందన్నారు.

News October 7, 2024

డోన్‌: హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

image

డోన్‌లోని కొండపేట వాసి షేక్ మదార్‌వలిపై గతనెల17న హత్యాయత్నం చేయగా కర్నూలులో చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందారు.ఈ కేసుకు సంబంధించి వ్యక్తిని కొట్టి చంపిన ఐదుగురిని రిమాండ్‌కి పంపినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. వారిని గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. హరికృష్ణ, చెన్నకేశవులు, రంగమని, మౌలాలి, శివసాయి కలిసి వలిని కర్రలతో, రాడ్లతో కొట్టినట్లు సీఐ తెలిపారు.