News December 12, 2024

పెద్దపులి సంచరిస్తోంది.. అప్రమత్తంగా ఉండాలి: SI

image

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బోధపురం, ఆలుబాక, పెంకవాకు, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామ శివార్లలో పెద్దపులి సంచరించినట్లుగా అటవీ అధికారులు ధ్రువీకరించారని ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు తెలిపారు. గ్రామస్థులు వ్యవసాయ పనుల నిమిత్తం, పశువుల మేతకు లేదా ఇతర పనులకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.

Similar News

News January 21, 2025

గ్రామ సభలో పాల్గొన్న వరంగల్ పోలీస్ కమిషనర్

image

నేటి నుంచి ప్రారంభమైన గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా నగరంలోని డివిజన్ల పరిధిలో నిర్వహిస్తున్న గ్రామ సభలకు వరంగల్ పోలీస్ కమిషనర్ హాజరువుతున్నారు. ఇందులో భాగంగా 22వ డివిజన్లో నిర్వహించిన గ్రామ సభకు పోలీస్ కమిషనర్ పాల్గొని పోలీస్ బందోబస్తుతో పాటు సభ ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సభలకు స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, వరంగల్ ఏసీపీ నందిరాం మట్టేవాడ ఇన్‌స్పెక్టర్ పాల్గొన్నారు.

News January 21, 2025

దీప్తి జీవాంజిని వరించిన మరో అవార్డు

image

ఇటీవల అర్జున అవార్డు అందుకున్న ఓరుగల్లు బిడ్డ దీప్తి మరో అవార్డుకు ఎంపికైంది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డుకు దీప్తి ఎంపికైనట్లు సోమవారం ప్రకటించారు. ఈ అవార్డును గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఈనెల 26న ప్రదానం చేయనున్నారు. అవార్డులో భాగంగా రూ.2లక్షల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. కాగా, దీప్తి పర్వతగిరి మండలం కల్లెడవాసి.

News January 21, 2025

కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి: సీతక్క

image

ములుగు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకై ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలని, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ పని చేస్తుందన్నారు.