News August 13, 2024
పెద్దపూర్ గురుకులానికి చేరుకున్న డిప్యూటీ సీఎం

మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల సంక్షేమ హాస్టల్కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం హాస్టల్ను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Similar News
News October 27, 2025
KNR: ఎస్యూ స్నాతకోత్సవానికి గవర్నర్కు ఆహ్వానం

శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్యూ) ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్, నవంబర్ 7న జరగనున్న రెండవ స్నాతకోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను కులపతి, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు అందజేశారు. స్నాతకోత్సవ ఏర్పాట్ల పనులు దాదాపు పూర్తవుతున్నాయని ఆయన గవర్నర్కు వివరించారు. గవర్నర్ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు.
News October 27, 2025
కరీంనగర్: మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపునకు ఈ లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు.
News October 27, 2025
మొదటిసారిగా కరీంనగర్లో..!

కరీంనగర్లో మొదటిసారిగా ఏ- డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్ జరగనుంది. అలుగునూరులోని వెల్చల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ చారిత్రాత్మక పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో హైదరాబాద్ వెలుపల అధికారిక ఏ- లెవల్ లీగ్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే తొలి జిల్లాగా కరీంనగర్ నిలిచింది.


