News August 13, 2024

పెద్దపూర్ గురుకులానికి చేరుకున్న డిప్యూటీ సీఎం

image

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల సంక్షేమ హాస్టల్‌‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం హాస్టల్‌ను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Similar News

News September 7, 2024

పెద్దపల్లిలో ప్రైవేట్ ఆంబులెన్సుల దందా!

image

పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజురోజుకూ పెరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆంబులెన్సులు 6, ప్రైవేట్ అంబులెన్సులు 36 వరకు ఉన్నాయి. అయితే పేషెంట్లు చెప్పిన ఆసుపత్రులకు కాకుండా తమకు కమిషన్లు ఇచ్చే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. పైగా రవాణా చార్జీలు విపరీతంగా తీసుకుంటున్నారని, అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News September 7, 2024

కరీంనగర్: ప్రేమ పెళ్లి పేరుతో మోసం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

image

ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని రెండుసార్లు అబార్షన్ చేయించి తనను మోసం చేశాడని కరీంనగర్ మండలానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండలానికి చెందిన ఓ యువకుడు.. తనకు రెండుసార్లు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 7, 2024

KNR: బంతి, చామంతి పూలకు భలే గిరాకి.. కిలో రూ.200

image

వినాయక చవితిని పురస్కరించుకొని కరీంనగర్లో మార్కెట్లో బంతి, చామంతి పూల రేట్లను అమాంతంగా పెంచేశారు. మామూలు రోజుల్లో కిలోకు రూ.50 ఉండే బంతి పూలకు రూ.100, చామంతి పూలకు రూ.200, గులాబీ పూలకు రూ.250-300 వరకు అమ్ముతున్నాయి. కరీంనగర్ మార్కెట్లో భారీగా కొనుగోలుదారులు, వినాయక మండపాల నిర్వాహకులు బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.