News July 16, 2024
పెద్దపెల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం బంజరపల్లి గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అతివేగంగా ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, బొలెరో వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 10, 2026
KNR: చైనా మాంజా వాడితే కఠిన చర్యలు: సీపీ

సంక్రాంతి వేళ నిషేధిత చైనా మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు. నైలాన్ దారాల వల్ల పక్షులు, వాహనదారులకు ప్రాణాపాయం ఉందని, వీటిపై నిఘాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం కాటన్ దారాలనే వాడి, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.
News January 10, 2026
KNR: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గత పది రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 6,665 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,553 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి నిల్వ చేయవద్దని, డిమాండ్ మేరకు మరిన్ని నిల్వలు తెప్పిస్తామని రైతులకు సూచించారు.
News January 10, 2026
KNR: ‘పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి’

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల మధ్య నిర్ధేశిత దూరాన్ని పాటించాలని, విద్యుత్, తాగునీరు, లైటింగు, వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపులను ఏర్పాటుచేయాలన్నారు.


