News October 29, 2024

పెద్దముడియం: కూతురిపై తండ్రి లైంగిక దాడి

image

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కసాయిలా మారి కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం పెద్దముడియంలో జరిగింది. నెమళ్లదిన్నె గ్రామానికి చెందిన మతిస్తిమితం లేని ఓ బాలికపై మద్యానికి బానిసైన తండ్రి అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 10, 2024

కడపలో పోస్టర్ కలకలం.. EX ఆర్మీ పేరిట పోస్టర్

image

కడపలో ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. నగరంలోని 7రోడ్ల వద్ద EX ఆర్మీ పేరిట ఈ పోస్టర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేసే దమ్మున్న మగాడు, మొనగాడు లేడా అని పోస్టర్లో రాశారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఎం, సీపీఐ అన్ని పార్టీలను విమర్శించారు ఇంతకూ ఈ పోస్టర్‌ని ఎవరు ఎవరు అంటించారనేది ప్రజల్లోనూ, రాజకీయ నాయకుల్లోనూ చర్చనీయాంశమైంది.

News November 10, 2024

ఉమ్మడి కడప జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డులు వీరికే.!

image

ఉమ్మడి కడప జిల్లాలో బెస్ట్ టీచర్లను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఎంపికయ్యారు.
➤S కొండారెడ్డి (మోడంపల్లి హైస్కూల్) సైన్స్ టీచర్ ప్రొద్దూటూరు మండలం కడప జిల్లా
➤A అనిత (KGBV ప్రిన్సిపల్) కలకడ మండలం అన్నమయ్య జిల్లా
➤రామిశెట్టి నాగరత్నమ్మ (సిద్దవరం KGBV) ఇంగ్లీషు ఉపాధ్యాయురాలు పెద్దమడియం మండలం అన్నమయ్య జిల్లా

News November 10, 2024

ఆర్మీ ర్యాలీకి సర్వం సిద్ధం

image

కడప నగరంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కడప నగరంలోని మునిసిపల్ మైదానంలో నిర్వహించే ర్యాలీకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆర్మీ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొని ప్రారంభిస్తారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు కడపకు చేరుకున్నారు.