News February 18, 2025

పెద్దశేష వాహనంపై వైకుంఠ నాథుడి దర్శనం

image

శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు మంగళవారం రాత్రి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామికి పెద్దశేష వాహన సేవ జరిగింది. వైకుంఠనాథుని అలంకారంలో స్వామివారు దర్శనం ఇచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు పట్టారు.

Similar News

News February 23, 2026

అంతర పంటలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.

News February 23, 2026

జగిత్యాల: బాధితులకు సత్వర న్యాయం చేయాలి: ఎస్పీ

image

గ్రీవెన్స్ డే సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 23, 2026

మంత్రపుష్పం అంటే ఏంటి?

image

మంత్రాలను పూలతో దేవుడిని అర్చించడమే ‘మంత్రపుష్పం’. దీన్ని యజుర్వేదంలోని తైత్తీరియారణ్యకం నుంచి సేకరించారు. ఇందులో పంచభూతాలకు, నక్షత్రాలకు, పరమాత్మకు గల సంబంధాన్ని వివరిస్తారు. సృష్టి మొత్తం దైవత్వం ఉందని చాటిచెప్పే వేదసారం ఇది. పూజ ముగింపులో దైవాన్ని రాజాధిరాజుగా కీర్తిస్తారు. భక్తిశ్రద్ధలతో దీనిని పఠిస్తారు. దీనిని నిలబడి చదవాలనే నియమం ఉంది. ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఇచ్చే గౌరవం.