News February 6, 2025
పెద్దాపురం ఎంపీడీవోకు జిల్లా అధ్యక్ష పదవి

ఏపీ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం ఎంపీడీవో డి.శ్రీలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంఘం కాకినాడ జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. జిల్లా అధ్యక్షురాలిని ఎన్నుకున్నారు. అనంతరం శ్రీలలితకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 18, 2025
ఆరోగ్యకరమైన జుట్టుకు చిలగడదుంప

చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని ఇది అడ్డుకుంటుంది. చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ A, C, B, E, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
News October 18, 2025
పాకిస్థాన్‌ది అనాగరిక చర్య: రషీద్ ఖాన్

జనావాసాలపై పాక్ చేసిన వైమానిక దాడిని అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ‘ఈ అనాగరిక, ఆటవిక చర్యలో మహిళలు, పిల్లలు, దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ట్రై సిరీస్ నుంచి వైదొలగాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఈ క్లిష్ట సమయాల్లో నా ప్రజల పక్షాన నిలబడతా’ అని ట్వీట్ చేశారు.
News October 18, 2025
విశాఖకు గూగుల్ రాక శుభపరిణామం: ఎంపీ శబరి

గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్‌కు శుభసంకేతమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలను హైదరాబాదుకు ఆహ్వానించిన చంద్రబాబు ఇప్పుడు నవ్యాంధ్ర ముఖచిత్రాన్ని మారుస్తున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు.