News February 6, 2025
పెద్దాపురం ఎంపీడీవోకు జిల్లా అధ్యక్ష పదవి

ఏపీ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం ఎంపీడీవో డి.శ్రీలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సంఘం కాకినాడ జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. జిల్లా అధ్యక్షురాలిని ఎన్నుకున్నారు. అనంతరం శ్రీలలితకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 17, 2026
నెల్లూరు: నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ..

భర్త తీరుతో మనస్తాపానికి గురై వివాహిత సూసైడ్ చేసుకుంది. నెల్లూరు అనగుంటకు చెందిన ప్రతాప్, మహిత(20) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగిన కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఆమెను నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ మానసికంగా వేధించడంతోపాటు కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 17, 2026
పాడేరు: 36 మందిపై కేసులు కొట్టివేత

ఆదివాసీ ఉద్యమకారులు 36 మందిపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను పాడేరు ప్రథమ శ్రేణి జ్యూడీషియల్ కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చినట్లు గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స సోమవారం తెలిపారు. 2021లో జీవో నెంబర్-3ని చట్టబద్ధం చేయాలని కోరుతూ చేపట్టిన బంద్ ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందన్నారు. ఆ కేసును కోర్టు కొట్టివేసిందన్నారు.
News March 17, 2026
KKRకు గాయాల ‘దెబ్బ’

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్‌మెంట్ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్‌లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.


