News January 29, 2025
పెద్దాపురం: ప్రేమ పేరుతో పెళ్లి..వ్యభిచారం చేయాలని ఒత్తిడి

ప్రేమ పేరుతో మైనర్ బాలికను పెళ్లి చేసుకుని, ఆపై వ్యభిచారం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దాపురానికి చెందిన చందుకి అనకాపల్లికి చెందిన బాలిక (17) తుని రైల్వేస్టేషన్లో పరిచయమైంది. ప్రేమ పేరుతో వల వేసి పెళ్లి చేసుకుని డబ్బుల కోసం భర్త చందు, అత్త నీలిమ వ్యభిచారంలోకి దింపే ప్రయత్నం చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదుచేశామని వి.మౌనిక తెలిపారు.
Similar News
News October 28, 2025
ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో భారీ అవకతవకలు: బీఆర్ నాయుడు

ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు ఉద్యోగులు భారీ అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని TTD చైర్మన్ BR నాయుడు తెలిపారు. పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల అవినీతిపై ACB విచారణ చేయాలని తీర్మానం చేశామన్నారు. అనేక వస్తువులు కొనుగోళ్లలో గోల్ మాల్ సాగినట్లు తెలిసిందన్నారు. ఉదాహరణకు బయట రూ.400కొనే శాలువలు రూ.1300 కొన్నట్లు తెలిసిందన్నారు.
News October 28, 2025
రేపు, ఎల్లుండి పలు ఆర్జిత సేవలు రద్దు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్లుండి పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. దీనికి సంబంధించి రేపు రాత్రి 8-9 గంటల వరకు పుష్పయాగానికి అర్చకులు అంకురార్పణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఎల్లుండి తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఉండవని పేర్కొంది.
News October 28, 2025
తుఫాన్ చర్యలపై రాజమండ్రి MP ఆరా

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


