News January 6, 2025

పెద్దాపురం: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

పెద్దాపురం ఇండస్ట్రియల్ ప్రాంతంలో సోమవారం లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట గణపతి నగరానికి చెందిన పెంకె అప్పారావు బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు అప్పారావు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 19, 2025

ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన రాజామని శివ (22)పేరవరం నుంచి తుని పంక్షన్‌కు వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

News January 19, 2025

కూనవరం: ఆదివాసీల సామూహిక చేపల వేట

image

కూనవరం మండలం చిన్నారుకుర్ పెద్ద చెరువులో ఆదివారం ఆదివాసీలు సామూహిక చేపల వేట నిర్వహించారు. సంక్రాంతి తర్వాత సంప్రదాయంగా చేపల వేట చేస్తామన్నారు. నాలుగు మండలాల నుంచి 3000 మంది చిన్నా ,పెద్దా తేడా లేకుండా ఆదివాసీ పెద్దల సమక్షంలో చేపల వేట సాగించారు. గ్రామ పెద్దలు బంధువులు అందరికీ కబురు పెట్టి వారి సమక్షంలో వయసుతో నిమిత్తం లేకుండా ఈ వేట సాగిస్తారన్నారు. 

News January 19, 2025

పిఠాపురంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య

image

పిఠాపురంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు బూరుగుపాలెంకు చెందిన గూనూరు భరత్(22)గా గుర్తించారు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్‌లో ఉద్యోగం చేశాడు. ప్రేమించిన యువతి దూరమవుతుందని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు.