News November 22, 2024

పెద్దిరెడ్డికి అదనపు బాధ్యతలు

image

మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ YCP అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఆయనకు తాజాగా ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Similar News

News December 8, 2024

తిరుపతి, చిత్తూరుకు రైట్ రైట్ అంటున్న బడా హీరోలు

image

తెలుగు సినిమా ఉ.చిత్తూరు జిల్లాకు వరుసగా హాయ్ చెబుతోంది. చిత్తూరు నేపథ్యంలో ‘పుష్ప’ ఎంతటి హవా చూపించిందో తెలిసిందే. అంతకన్నాముందు నివేథా థామస్ 35 ఇది చిన్న కథకాదు, శర్వానంద్ శ్రీకారం, కిరణ్ వినరో భాగ్యం విష్ణు కథ సినిమాల షూటింగ్ ఇక్కడే జరిగింది. శేఖర్ కమ్ముల-ధనుష్ కాంబోలో వస్తున్న ‘కుబేర’ సైతం తిరుపతిలో షూటింగ్ జరిగింది. తమ యాస, భాష సరిహద్దులు దాటుతుందంటూ జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

News December 7, 2024

అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్

image

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మార్పులతో కూడిన పథకం అమలు చేయనుంది టీటీడీ.

News December 7, 2024

‘రూ.200 కోట్లు విలువైన భూములను పెద్దిరెడ్డి కబ్జా చేశారు’

image

రూ.200కోట్ల విలువైన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేశారని మదనపల్లెకు చెందిన బాసాని సునీత, రెడ్డి గోపాల్ నాయుడు దంపతులు ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌కి ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన కట్టా సులోచనను పెద్దిరెడ్డి బినామీగా పెట్టి మదనపల్లెకు చెందిన 15 కుటుంబాలకు చెందిన భూమికి కబ్జా చేశారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.