News January 8, 2025
పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇచ్చేయండి: హైకోర్టు

ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి నుంచి పోలీసులు లైసెన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. 2 వారాల్లోనే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయుధాలు అప్పగించాలని జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఆదేశించారు.
Similar News
News October 24, 2025
చిత్తూరు జిల్లాలో 177 ఎకరాలలో దెబ్బతిన్న వరి పంట

వర్షాల కారణంగా జిల్లాలో 177 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. 12 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో 172 మంది రైతులు సాగు చేసిన వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 70 ఎకరాల్లో పైరు దెబ్బతినగా, చౌడేపల్లె మండలంలోని ఒకే గ్రామంలో 40 ఎకరాలు, యాదమరి మండలంలోని ఐదు గ్రామాల్లో 12.25 ఎకరాలు సాగు చేసిన వరి పైరు దెబ్బతింది.
News October 24, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో బంగారుపాళ్యం మినహా 31 మండలాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిండ్రలో 83.4 మిమీ, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది. మండలాల వారీగా కుప్పంలో 35.2, విజయపురంలో 34.4, నగరిలో 28.8, శ్రీరంగరాజపురంలో 26.8, పాలసముద్రంలో 26.6, గుడుపల్లెలో 23.6, సోమలలో 14.6 మీ. మీ వర్షపాతం నమోదు అయింది.
News October 23, 2025
చిత్తూరులో భద్రత కట్టుదిట్టం.!

చిత్తూరు మాజీ మేయర్ కటారి <<18085908>>అనురాధ దంపతుల<<>> హత్య కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. CHUDA చైర్పర్సన్ కె.హేమలత, మాజీ MLA సి.కె.బాబు నివాసాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా న్యాయమూర్తి, APP, డిఫాక్టో కంప్లైనెంట్ నివాసాల వద్ద సైతం భద్రత పెంచారు. నేరపూర్వ చరిత్ర ఉన్న వారిపై నిఘా కొనసాగుతోందని DSP సాయినాథ్ తెలిపారు.


