News June 17, 2024
పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు..!
YCP హయాంలో జరిగిన అక్రమాలను బయటపెట్టిన తనకు రక్షణ కల్పించాలంటూ B.కొత్తకోటకు చెందిన మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరులు తనను వేధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ఇంటిపై కూడా దాడి చేశారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. తన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు పెద్దిరెడ్డి సోదరులకు నోటీసులు ఇచ్చిందని మాజీ జడ్జి వెల్లడించారు.
Similar News
News January 16, 2025
చిత్తూరు: రేపటి నుంచి కానిస్టేబుళ్లకు పరీక్షలు
స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల (సివిల్, ఎ.పి.ఎస్.పి) దేహ దారుఢ్య సామర్థ్య పరీక్షలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ మైదానంలో 17, 18వ తేదీలలో జరగనున్నాయని ఎస్పీ మణికంఠ తెలిపారు. 8, 9 తేదీలలో జరగాల్సిన పరీక్షలు వైకుంఠ ఏకాదశి కారణంగా వాయిదా పడ్డాయన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
News January 16, 2025
తిరుమలలో విషాదం.. బాలుడి మృతి
తిరుమల వసతి సముదాయం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డ ఓ బాలుడు మృతిచెందాడు. కడప టౌన్ చిన్న చౌక్‌కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు శ్రీనివాస రాజు, సాత్విక్(3) అనే ఇద్దరు కుమారులతో కలిసి తిరుమలకు వచ్చారు. సాయంత్రం అన్నతో ఆడుకుంటూ సాత్విక్ కిందపడగా.. తీవ్ర గాయాలయ్యాయి. తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 16, 2025
నా చుట్టూ తిరిగితే పదవులు రావు: నారా లోకేశ్
నారావారిపల్లెలో బుధవారం ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చుట్టూ తిరిగితే పదవులు రావని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు. నాయకుల పనితీరుపై వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. పొలిట్‌బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30 శాతం కొత్తవారు రావాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు.