News March 13, 2025
పెద్దిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఓ కేసు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి M.R పల్లి మారుతినగర్ పరిధిలో బుగ్గమఠం భూముల ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈ నెల 7న నోటీసులు జారీ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్ట్ను ఆశ్రయించారు. అయితే ఈ భూములకు చెందిన ఎలాంటి పత్రాలు పెద్దిరెడ్డి వద్ద లేవని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమంటూ కోర్ట్ తేల్చి చెప్పింది.
Similar News
News December 19, 2025
ఈనెల 20న జరగాల్సిన జాబ్ మేళా వాయిదా

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తలపెట్టిన జాబ్మేళా అనివార్య కారణాలవల్ల వాయిదా వేస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఖాళీగా ఉన్న 150 పోస్టుల భర్తీకి ఈ మేళా చేపట్టారు. ఏదైనా డిగ్రీ, 18-45 ఏళ్ల వయసున్న వారు అర్హులని, నెలకు రూ.25 వేల వేతనం ఉంటుందన్నారు. తదుపరి తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు.
News December 19, 2025
పాలమూరు: భర్త చేతిలో భార్య దారుణ హత్య

ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మానసిక పరిస్థితి బాగలేక ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చాడు. గురువారం రాత్రి తన భార్య జమ్మలమ్మ (28)పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చినట్టు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్త గద్వాల ఆసుపత్రికి తరలించారు.
News December 19, 2025
ఖమ్మం జిల్లాలో 172మంది లష్కర్ల నియామకం

ఖమ్మం జిల్లా జలవనరుల శాఖలో సాగునీటి పంపిణీ పర్యవేక్షణ కోసం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 172మంది లష్కర్లను నియమించారు. మూడు ఏజెన్సీల ద్వారా చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారికి నెలకు రూ. 15వేల వేతనం చెల్లించనున్నారు. ఈ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


