News July 16, 2024
పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్
‘అటవీ, మైనింగ్ శాఖలకు ఒకే మంత్రి ఎక్కడా ఉండరు. తొలిసారి గత ప్రభుత్వం ఈ రెండింటిని ఒకరికే కట్టబెట్టి, దొంగచేతికి తాళాలిచ్చి దోచేసింది’ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు. ‘పుంగనూరు, కార్వేటినగరంలో అటవీ భూమిని ఆక్రమించి 6.72 హెక్టార్లలో అక్రమ మైనింగ్ చేశారు. మండిపడ్డారు. ఇదే ప్రాంతంలో 19.581 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించారు’ అని CM ఆరోపించారు.
Similar News
News October 16, 2024
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు
అల్పపీడన ప్రభావంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. అత్యధికంగా నింద్రలో 22.8 మిమీ, అత్యల్పంగా తపణంపల్లెలో 1.0 మిమీ వర్షం కురిసింది, మండలాల వారీగా రొంపిచెర్లలో 12, సదుంలో 9.6, పులిచెర్లలో 16.2, వెదురుకుప్పంలో 44, విజయపురంలో 5.4, నగరిలో 8.6, కార్వేటినగరంలో 5.4, పెనుమూరులో 3.6, పూతలపట్టులో 8.8, సోమలలో 12.6, చౌడేపల్లిలో 5.4, పుంగనూరులో 6.2మీ.మీ వర్షపాతం నమోదు అయింది.
News October 16, 2024
తిరుపతి: తమిళనాడు, కర్ణాటక వెళ్లే పలు రైళ్లు రద్దు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నుంచి తమిళనాడు రాష్ట్రం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతి- చెన్నై సెంట్రల్ (16203) తిరుపతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి- చామరాజనగర్ (16220)కాట్పాడి మీదుగా కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.
News October 15, 2024
తిరుపతి: రేపు కూడా పాఠశాలలకు సెలవు
తిరుపతి జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ వి.శేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో కాలేజీలకు కూడా వర్తిస్తుందన్నారు.