News August 14, 2024
పెద్దిరెడ్డిపై పిటిషన్.. విచారణ వాయిదా
సతీమణి ఆస్తులను అఫిడవిట్‌లో పొందుపరచని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ BCY అధినేత రామచంద్రయాదవ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇవాళ విచారణ జరిగింది. పెద్దిరెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో తెలిపాలని హైకోర్టు కోరింది. ఈ మేరకు పెద్దిరెడ్డిపై పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
Similar News
News September 19, 2024
ప్రముఖుల పర్యటనలో జాగ్రత్తగా ఉండాలి: తిరుపతి కలెక్టర్
తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటనలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వేంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బారాయుడుతో కలసి అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తిలో దర్శనాలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతుంటారని, ఆ మేరకు ఏర్పాట్లు లోపాలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
News September 18, 2024
కుప్పంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
కుప్పం చెరువు కట్టపై బుధవారం ట్రాక్టర్‌ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముగ్గురు విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నారని సమాచారం. మృతి చెందిన విద్యార్థులు మదనపల్లె, తిరుపతికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అర్బన్ సీఐ జీటీ నాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News September 18, 2024
తిరుపతి: ఈ నెల 20న ఉద్యోగ మేళా
తిరుపతి నగరం పద్మావతి పురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 5 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులన్నారు. మొత్తం 190 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.