News November 23, 2024

పెద్దిరెడ్డి అంటే ఎందుకు భయం: MLA

image

ఆర్థిక దోపిడీ చేయడానికి ప్రభుత్వం PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని ఎర్రగొండపాలెం వైసీపీ MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘జగన్ గారు భయపడి అసెంబ్లీకి రావడం లేదని కూటమి నాయకులు అంటున్నారు. మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే ఎందుకంత భయం? పీఏసీ ఛైర్మన్‌ పదవికి ఆయన నామినేషన్ వేస్తే ఎందుకు కుట్ర చేశారు?’ అని ప్రశ్నించారు. కాగా PAC ఛైర్మన్‌గా జనసేన MLA రామాంజినేయులు ఎన్నికయ్యారు.

Similar News

News December 13, 2024

CGHS వెల్ నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించాలి: తిరుపతి ఎంపీ

image

తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో కోరారు. దాని ప్రారంభానికి నిర్ణయం ప్రకటించి సంవత్సరం కావస్తున్నా.. నియామక అనుమతుల జాప్యంతో ఇంతవరకు ప్రారంభం కాలేదని  చెప్పారు. సెంటర్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సేవలు పొందటంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

News December 13, 2024

చిత్తూరు రైతులకు ఇది తెలుసా?

image

మామిడి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని చిత్తూరు జిల్లాలో ఎంతమందికి తెలుసు? ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే.. ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. డిసెంబర్ 15 నుంచి మే 31 మధ్యలో గాలులు, అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో 15వ తేదీలోగా మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలి.

News December 13, 2024

చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ప్రకటించారు. ప్రతి ఒక్క స్కూల్ ఈ నింబధన పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు నిన్ననే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.