News June 17, 2024

పెద్దిరెడ్డి ఊరిలో టీడీపీకి పడింది 9 ఓట్లే..!

image

కూటమి జోరులోనూ పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరైన సదుం మండలం ఎర్రాతివారిపాలెంలో ఆయనకు పడిన ఓట్లపై పలువురు ఆరా తీస్తున్నారు. స్థానిక గ్రామంలో మొత్తం 862 ఓట్లు ఉన్నాయి. ఇందులో 846 మంది వైసీపీకి ఓటు వేశారు. కేవలం 9 మందే టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి ఓటు వేశారు. ఐదుగురు కాంగ్రెస్‌కు, ఇద్దరు బీసీవై పార్టీకి మద్దతు తెలిపారు.

Similar News

News January 13, 2026

చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

image

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.

News January 13, 2026

చిత్తూరు: భారీగా దరఖాస్తులు

image

చిత్తూరు జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. నాన్ టీచింగ్‌కు సంబంధించి కేజీవీబీల్లో 22, మోడల్ స్కూళ్లలో 12 ఉద్యోగాలకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. 32పోస్టులకు 712దరఖాస్తులు వచ్చాయి. కేజీబీవీల్లోని 22 ఉద్యోగాలకు 461 దరఖాస్తులు, మోడల్ స్కూళ్లలోని 12 ఉద్యోగాలకు 251 వచ్చాయని అధికారులు వెల్లడించారు.

News January 13, 2026

ప్రభుత్వం పనితీరుపై చిత్తూరు ప్రజల స్పందన ఇదే..!

image

ప్రభుత్వ సేవలు అందడంలో చిత్తూరు జిల్లాలో 66% మందే సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పింఛన్ల పంపిణీపై 85.4, అన్న క్యాంటీన్లపై 84.4, దీపం పథకంపై 66.2, ఆర్టీసీ బస్సులపై 70.9, వైద్య సేవలపై 62.4, రిజిస్ట్రేషన్ సేవలపై 64.2, హౌసింగ్ పథకంపై 52.9, రెవెన్యూ సేవలపై 45.5, రెవెన్యూ సర్వేపై 45.1 శాతం సంతృప్తి ఉందని వివరించారు.