News July 31, 2024

పెద్దిరెడ్డి కుటుంబానికి 236 ఎకరాలు..?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన భార్య స్వర్ణలత, కుమారుడు మిథున్ రెడ్డి పేరిట 236 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ‘మీ భూమి’ పోర్టల్ ప్రకారం పెద్దిరెడ్డి పేరుతో 41.35, మిథున్ రెడ్డి పేరిట 23.42, స్వర్ణలత పేరిట 171.23 ఎకరాలు ఉన్నాయి. పుంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం దిగువపల్లె, మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుచానూరు తదితర గ్రామాల్లో భూములు కొన్నారు.

Similar News

News October 8, 2024

బెట్టింగ్‌కు దూరంగా ఉండండి: చిత్తూరు SP

image

బెట్టింగ్‌కు యువత దూరంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోళ్ విజ్ఞప్తి చేశారు. జీడీ నెల్లూరులో బెట్టింగ్ కారణంగా అప్పులపాలై కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన స్పందించారు. ‘బెట్టింగ్‌లో రూ.25 లక్షల వరకు పోగొట్టుకోవడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఏపీలో బెట్టింగ్ చట్టవ్యతిరేక చర్య. దీని ఊబిలో పడి మోసపోకండి’ అని ఎస్పీ సూచించారు.

News October 8, 2024

ఏర్పేడు: మందు తాగేటప్పుడు తిట్టాడని చంపేశారు

image

ఏర్పేడు మండలం పాపానాయుడుపేట వద్ద జరిగిన హత్య కేసులో దినేశ్ కుమార్, లోకేశ్ ఇద్దరు ముద్దాయిలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రవీణ్ కుటుంబానికి, దినేశ్ కుటుంబానికి మనస్పర్థలు ఉన్నాయని చెప్పారు. మందు సేవించేటప్పుడు ప్రవీణ్ దినేశ్‌ను తిట్టేవాడని, కొట్టేవాడని చెప్పారు. మనస్పర్ధలు కారణంగా ప్రవీణ్‌ను మచ్చు కత్తితో లోకేశ్ సహాయంతో దారుణంగా చంపినట్లు చెప్పారు.

News October 8, 2024

హత్య కేసులో అనిల్ పాత్రే కీలకం..

image

మదనపల్లె జగన్ కాలనీలో ఉండే స్వర్ణకుమారిని అదే కాలనీలో ఉండే వెంకటేశ్ నమ్మించి నీరుగట్టుపల్లిలోని సాయిరాంవీధికి చెందిన అనిల్ ఇంటికి గతనెల 28న తీసుకొచ్చాడు. అక్కడ మంత్రాలు, తాయత్తుల పేరుతో స్వర్ణకుమారిని అనిల్ పథకం ప్రకారం వెంకటేశ్, అనిల్ ఇద్దరు కలిసి హతమార్చారు. అనంతరం మూటగట్టుకుని గుంత తవ్వి స్వర్ణకుమారిని అందులో పాతిపెట్టారు. అనంతరం విమానాల్లో షికార్లు చేస్తుండగా పట్టుకున్నారు.