News July 12, 2024
పెద్దిరెడ్డి తీరుపైనే అందరి విమర్శలు..!

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పుంగనూరులో వరుస షాక్లు తగులుతున్నాయి. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ ఆలీం బాషా, కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. తాజాగా పులిచెర్ల ZPTC మురళీధర్తో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు YCPకి గుడ్ బై చెప్పేశారు. పుంగనూరు అభివృద్ధికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ సహకరించ లేదని ఆలీం బాషా అప్పుడు చెప్పగా.. ఇవాళ మురళీధర్ కూడా పెద్దిరెడ్డి తమకు అండగా ఉండకపోవడంతో రాజీనామా చేశామని చెప్పారు.
Similar News
News October 18, 2025
హంద్రీనీవాతో కుప్పం సస్యశ్యామలం

హంద్రీనీవాతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. శాంతిపురం (M) దండి కుప్పం చెరువు కృష్ణ జలాలతో నిండి మరవ పోవడంతో శుక్రవారం టీడీపీ నేతలు జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పంకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు మరో భగీరథ ప్రయత్నం చేశారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు.
News October 17, 2025
చిత్తూరు: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

తెలంగాణ(S) కామారెడ్డి(D) నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 17, 2025
చిత్తూరు: సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు

చిత్తూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలను నిర్వహించనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ఇందుకు రూ.5 వేలను ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలన్నారు. ముందుగానే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.