News November 22, 2024
పెద్దిరెడ్డి నామినేషన్.. చరిత్రలో తొలిసారి ఓటింగ్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇస్తుంటారు. ఈక్రమంలో వైసీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. పీఏసీలో మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. కూటమి ప్రభుత్వం నుంచే 9 మంది నామినేషన్లు వేశారు. వీరికి తోడుగా పెద్దిరెడ్డి నామినేషన్ పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి పీఏసీ ఛైర్మన్‌కు ఇవాళ ఓటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
Similar News
News July 9, 2025
చిత్తూరు: జగన్ పర్యటనపై DSP సూచనలు

బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనపైన DSP సాయినాథ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్, టూ టౌన్ సీఐలు మహేశ్వర్, నెట్టికంటయ్యలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జగన్ పర్యటనలో తప్పనిసరిగా పోలీసులు విధించిన ఆంక్షలు పాటించాలన్నారు. 500 మంది రైతులు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పదు అన్నారు.150 మందికి నోటీసులు జారీచేశామన్నారు.
News July 8, 2025
చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

చిత్తూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తే సహకారం అందజేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. నిరుద్యోగులకు శిక్షణ అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
News July 8, 2025
చిత్తూరు: వారి మధ్య నలుగుతున్నది పోలీసులే!

మామిడి రైతుల సమస్యల చుట్టూ జిల్లా రాజకీయం తిరుగుతుంది. పరిశ్రమలు వారు రూ. 8, ప్రభుత్వం రూ. 4, మొత్తం రూ.12 ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు న్యాయం చేయడం లేదని YCP బదులిస్తుంది. ఇటీవల YS జగన్ పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనలు నేపథ్యంలో సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. నిజానికి ఇరు పార్టీల రాజకీయం నడుమ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చర్చించుకుంటున్నారు.