News August 8, 2024
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి CRPF భద్రత..?
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేంద్ర హోం శాఖ CRPF భద్రత కల్పించినట్టు సమాచారం. ఇటీవల పుంగనూరులో అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల నుంచి హాని ఉందని.. భద్రత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది.
Similar News
News September 20, 2024
బంగారుపాళ్యం నుంచే దండయాత్రగా మారింది: లోకేశ్
కుప్పం నుంచి చేపట్టిన తన యువగళం యాత్ర బంగారుపాళ్యం నుంచి దండయాత్రగా మారిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చి అడ్డంకులు సృష్టించింది. అయినా భయపడలేదు. నాపై 23 కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సూపర్-6 పథకాలు ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి వాటిని అమలు చేస్తా’ అని లోకేశ్ చెప్పారు.
News September 20, 2024
మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం
బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం జరిగింది. ఇటీవల ఇక్కడ ఘోర ప్రమాదం జరగడంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వీటిపై అవగాహన లేని ఓ టెంపో ట్రావెలర్ వేగంగా వచ్చి ఇక్కడ అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News September 20, 2024
ప్రభుత్వ ఉద్యోగులకు హెల్మెట్ తప్పనిసరి: చిత్తూరు కలెక్టర్
చిత్తూరు జిల్లాలో బైక్‌లు వాడే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా హెల్మెట్లను వినియోగించడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.