News November 12, 2024
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా చేయాలి: సప్తగిరి
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడానికి తీరిక లేని MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. మంగళవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కుప్పంలో చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడిస్తానని బీరాలు పలికిన పెద్దిరెడ్డి నేడు అసెంబ్లీకి వెళ్లడానికి ముఖం చాటేశారని అన్నారు.
Similar News
News December 14, 2024
తిరుపతి: రెవెన్యూ సదస్సులో 593 ఫిర్యాదులు
తిరుపతి జిల్లాలో శుక్రవారం 43 ప్రాంతాలలో రెవెన్యూ సదస్సులు జరిగాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందులో సమస్యలపై 593 ఫిర్యాదులు అధికారులకు అందాయని ఆయన చెప్పారు. ఏడు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్టు పేర్కొన్నారు. మిగిలిన వాటిని నిర్దేశించిన సమయంలో అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
News December 13, 2024
CGHS వెల్ నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించాలి: తిరుపతి ఎంపీ
తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో కోరారు. దాని ప్రారంభానికి నిర్ణయం ప్రకటించి సంవత్సరం కావస్తున్నా.. నియామక అనుమతుల జాప్యంతో ఇంతవరకు ప్రారంభం కాలేదని చెప్పారు. సెంటర్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సేవలు పొందటంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
News December 13, 2024
చిత్తూరు రైతులకు ఇది తెలుసా?
మామిడి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని చిత్తూరు జిల్లాలో ఎంతమందికి తెలుసు? ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే.. ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. డిసెంబర్ 15 నుంచి మే 31 మధ్యలో గాలులు, అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో 15వ తేదీలోగా మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలి.