News July 31, 2024
పెద్దిరెడ్డి 20వేల ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి

రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామచంద్రారెడ్డి, ఆయన ముఠా దాదాపు 20 వేల ఎకరాలు కబ్జా చేశారని, వాటి విలువ రూ.45 వేల కోట్లు ఉంటుందన్నారు. దీనిని తప్పించుకోవడానికే మదనపల్లె ఆర్డీవో కార్యలయంలో 22A ఫైళ్లు దగ్ధం చేశారన్నారు. మొత్తం 14 వేల ఎకరాలకు సంబంధించి ఫైళ్లు బూడిదయ్యాయన్నారు. అంతే కాకుండా పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ PLR కు చెందిన టిప్పర్లపై విచారణ చేపడతామన్నారు.
Similar News
News December 16, 2025
చిత్తూరు: నూతన పోలీసుకు SP సూచనలు.!

చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీసు కానిస్టేబుల్లు వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని SP తుషార్ డూడీ తెలిపారు. ఎంపికైన వారు 20వ తేదీ ఉ.9 గం.లకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు రావాలన్నారు. వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్, 6 ఫొటోలు, రూ.100 బాండ్‌తో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ 9 నెలలు ఉండనుంది.
News December 16, 2025
AMCల ద్వారా రూ.80 లక్షల ఆదాయం

జిల్లా మార్కెటింగ్ శాఖకు AMC ల ద్వారా నవంబరులో రూ.80.03లక్షల ఆదాయం వచ్చినట్లు AD పరమేశ్వరన్ తెలిపారు. పలమనేరు AMC లో రూ.50.58 లక్షలు, చిత్తూరుకు రూ.11.37 లక్షలు, పుంగనూరుకు రూ.7.34 లక్షలు, బంగారుపాళ్యంకు రూ.2.35 లక్షలు, నగరికి రూ.2.16 లక్షలు, కుప్పంకు రూ.4.13 లక్షలు, పెనుమూరుకు రూ.74 వేలు, రొంపిచె ర్లకు రూ.69వేలు, SR పురం రూ.36వేలు, అత్యల్పంగా సోమల AMC ద్వారా రూ.31వేలు వచ్చినట్లు PD తెలిపారు.
News December 16, 2025
పూతలపట్టు: హైవేపై ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన బస్సు

పూతలపట్టు మండలం కిచ్చన్న గారి పల్లి సమీపంలో ఆరు లైన్ల జాతీయ రహదారిపై లారీని బస్సు ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం రాత్రి ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రయివేట్ బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు


