News April 2, 2025
పెద్దేముల్లో మహిళ మృతదేహం.. చేతిపై యశోద

పెద్దేముల్ మండల కేంద్రంలోని కోట్పల్లి ప్రాజెక్టు కాలువలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి వివరాలను ఎస్ఐ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. మహిళ వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. మహిళా మొహంపై చీర వేసి కాల్చినట్లు ఉందని చెప్పారు. చేతిపై యశోద అనే పేరుతో పచ్చబొట్టు ఉందన్నారు. మహిళను గుర్తిస్తే 8712670053, 8712670051, 8712670017నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News November 18, 2025
వాట్సాప్లో మీసేవ సర్వీసులు ప్రారంభం

TG: మీసేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రజలు మీసేవలో పొందే మొత్తం 580 సేవలను వాట్సాప్లోనే పొందచ్చు. ప్రజలు ఇంటి నుంచే విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి కూడా ఇంటి నుంచే పొందే వీలుంటుంది. ఇవన్నీ క్రమంగా వాట్సాప్లో అందుబాటులోకి రానున్నాయి.

కామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం శాబ్దీనగర్ గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పనుల పురోగతిని పరిశీలించి లబ్ధిదారురాలు చింతల సుమలత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల తీరు, బ్యాంక్ రుణం, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇసుక సరఫరా వంటి అంశాలపై లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.