News January 25, 2025
పెద్దేముల్: కొండముచ్చుపై కుక్కల దాడి

పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామ సమీపంలో కొండముచ్చుపై కుక్కలు దాడి చేశాయి. దీంతో కొండముచ్చుకు తోక తెగిపోయి, మూతిపై గాయాలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో చెట్టు ఎక్కి కూర్చుంది. గమనించిన గ్రామ యువకులు శత విధాలుగా ప్రయత్నం చేసి కొండముచ్చును కిందికి దింపారు. పశువైద్య సిబ్బందితో చికిత్స చేయించారు. యువకులు చేసిన మానవీయ సేవలకు పలువురు అభినందిస్తున్నారు.
Similar News
News November 28, 2025
‘అమరావతిలో పరిష్కారమైన లంక భూముల సమస్య’

రాజధాని ల్యాండ్ పూలింగ్కు లంక భూమలు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని, లంక భూములిచ్చిన రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వెల్లడించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించామన్నారు.
News November 28, 2025
అభ్యర్థులకు నల్గొండ కలెక్టర్ కీలక సూచన

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో ఎక్కడా కూడా ఖాళీగా వదిలి వేయవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో అంశాలు ఏవైనా తమకు వర్తించకపోతే నాట్ అప్లికేబుల్ (NA) లేదా నిల్ అని రాయాలన్నారు. ఖాళీగా వదిలేస్తే మాత్రం అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. నామినేషన్ పత్రాలను రాయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
News November 28, 2025
NLG: లావాదేవీలు జరగని డబ్బు.. తీసుకునేందుకు అవకాశం

జిల్లాలో ఆయా బ్యాంకుల్లో లావాదేవీలు జరగని డబ్బు వివిధ ఖాతాల్లో రూ.2.04 కోట్లు ఉంది. ఖాతాదారులు మృతిచెందడం, నామిని వివరాలు లేకపోవడం, డబ్బులు డిపాజిట్ చేసిన విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం తదితర కారణాలతోపాటు బ్యాంకుల్లో డబ్బు ఎక్కడికి పోతాయనే ధీమాతో డబ్బును అలాగే ఉంచుతున్నారు. బ్యాంకు వారిని కలిసి మొత్తాన్ని తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అవకాశం కల్పించింది.


