News March 19, 2025
పెద్దేముల్ మండలంలో తెల్లవారుజామున హత్య

పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున హత్య జరిగింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హన్మాపూర్ వరుస హత్యలు కలవర పెడుతున్నాయి.
Similar News
News March 20, 2025
MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!

✔పదేళ్లలో BRSది విధ్వంస పాలన: మంత్రి జూపల్లి✔నాగర్‌కర్నూల్: SLBCలో పనులు వేగవంతం: కలెక్టర్✔MBNR: PUలో పలు విభాగాల్లో అధిపతుల నియామకం✔TG KHO-KHO జట్టు కెప్టెన్‌గా పీడీ బి.రూప(మక్తల్)✔GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం✔బిజినపల్లి: జాతీయ జెండాకు అవమానం.. డీఈవో వివరణ✔కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్✔ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
News March 20, 2025
రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదు: జేసీ

రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులను అందచేయాలని జేసీ రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడారు. 13 గ్రామాలలో రైతులకు 9(2) నోటీసులను అందజేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు తన భూమికి సంబంధించి నోటీసులు అందలేదని ఫిర్యాదులు రాకూడదన్నారు.
News March 20, 2025
వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.పివి నందకుమార్ రెడ్డి

కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్‌గా డా.పివి నందకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. యూనివర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ముచ్చటించారు. వీసీకి రిజిస్టర్ సంధ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రమేశ్, ప్రవీణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.