News February 16, 2025
పెద్దేముల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

పెద్దేముల్ PS పరిధిలో జరిగిన యాక్సిడెంట్‌లో యువకుడు మృతి చెందాడు. SI శ్రీధర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. తాండూర్ మండలం కోటబాస్‌పల్లికి చెందిన ముద్దంగళ్ళ బాలకృష్ణ(28) HYDలో ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో బాలకృష్ణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జగిగినట్లు SI తెలిపారు.
Similar News
News March 9, 2026
ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

సూరత్(గుజరాత్)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.
News March 9, 2026
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 124 మంది గైర్హాజర్

ఉమ్మడి అల్లూరి జిల్లాలో సోమవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 124 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అల్లూరి జిల్లాలో 504 మందికి గాను 459 మంది రాశారని, పోలవరం జిల్లాలో 504కి గాను 459 మంది రాశారని తెలిపారు. చింతూరు ZPHS పరీక్ష కేంద్రాన్ని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు తనిఖీ చేశారు.
News March 9, 2026
విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.


