News February 13, 2025

పెద్దేముల్: సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఫిబ్రవరి 15న శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేనావత్ రవికుమార్, మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పెద్దేముల్ తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. దేశంలో 15 కోట్ల మంది, రాష్ట్రంలో 40 లక్షలమంది లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, గోవింద్ నాయక్, సవిత తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై <<>>క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

News February 19, 2025

నేడు ఢిల్లీకి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11.30కి జరిగే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఈ మేరకు ఎన్డీయే పెద్దలు ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం జరగనుంది. కాబోయే ముఖ్యమంత్రిని ఈ సమావేశంలో ఎంచుకోనున్నారు. ఎవరి పేరును ప్రకటిస్తారన్న ఆసక్తి బీజేపీ వర్గాల్లో నెలకొంది.

News February 19, 2025

పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

image

AP: తమ ఆదేశాలను లెక్కచేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదు చేయడం, కస్టడీలో కొట్టడం తప్ప దర్యాప్తు చేయడంలేదని క్లాస్ తీసుకుంది. ఇలాంటి వైఖరిని సహించేది లేదని తేల్చిచెప్పింది. బొసా రమణ అనే వ్యక్తిపై 27 కేసులుండగా అతడి భార్య దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో పూర్తి వివరాలెందుకు సమర్పించలేదంటూ నిలదీసింది.

error: Content is protected !!