News February 13, 2025
పెద్దేముల్: సెలవు ఇవ్వాలని డిమాండ్

ఫిబ్రవరి 15న శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేనావత్ రవికుమార్, మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పెద్దేముల్ తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. దేశంలో 15 కోట్ల మంది, రాష్ట్రంలో 40 లక్షలమంది లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, గోవింద్ నాయక్, సవిత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
2000km దూరం నుంచి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు

గురుగ్రామ్ డాక్టర్లు 2000km దూరంలోని బెంగళూరులో రోగికి అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ చేశారు. SS ఇన్నోవేషన్స్ రూపొందించిన స్వదేశీ సర్జికల్ రోబో SSI మంత్ర సాయంతో సర్జరీని విజయవంతం చేశారు. కన్సోల్ వెనక కూర్చున్న డాక్టర్లు 3D గ్లాసెస్ పెట్టుకొని స్క్రీన్ చూస్తూ 2:40hrs శ్రమించారు. BLR డాక్టర్లు ఇక్కడ రోబోను అమర్చారు. గతంలో 48KM, 286KMకే సాధ్యమైన టెలీసర్జరీ 2000KM దూరాన చేయడం ఇదే తొలిసారి.
News March 28, 2025
నాడు వైఎస్సార్.. నేడు జగన్ పోలవరానికి అడ్డు: నిమ్మల

AP: 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు 72% పోలవరం పనులను పూర్తిచేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అప్పట్లో మధుకాన్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి YSR, 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రాజెక్టుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇప్పటికీ జగన్ ముఠా సైంధవుల్లా పోలవరం పురోగతికి ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. 9 నెలల పాలనలోనే CBN ప్రాజెక్టుకు రూ.5,052 కోట్లు అడ్వాన్స్‌గా సాధించారని చెప్పారు.
News March 28, 2025
అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

అనకాపల్లి జిల్లాలో పోలీసుల సమస్యల పరిష్కారానికి ఎస్పీ తుహీన్ సిన్హాను శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పలువురు పోలీసులు పాల్గొని వారి సమస్యలపై ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎస్పీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.