News March 28, 2024

పెద్ద కొడప్గల్: ఎస్సై పై దాడి చేసిన వారిపై కేసు

image

పెద్ద కొడప్గల్ ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై దాడికి పాల్పడిన దుండగులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద ఎస్సై తెలిపారు. బేగంపూర్ గేటు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై కాస్లాబాద్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి గొడవకు దిగి, దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.

Similar News

News February 26, 2026

NZB: ‘సైక్లింగ్ క్రీడాభివృద్ధికి కృషిచేస్తా’

image

నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు గురువారం జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సైక్లింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు క్రీడా సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని డీవైఎస్‌ఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

News February 26, 2026

BREAKING: నిజామాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

image

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్‌ను భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను TGSPDCL ఛైర్మన్&MDగా బదిలీ చేశారు.

News February 26, 2026

NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయని తెలిపారు.